: మావోయిస్టుల హెచ్చరికలు.. ఏపీలో ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు


మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజాప్రతినిధులకు పోలీసులు భద్రత పెంచారు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే జన చైతన్య యాత్రలకు సర్పంచ్ నుంచి మంత్రి వరకు అందరికీ భారీ భద్రత కల్పించాలని డీజీపీ ఆదేశించారు. నేడు ఒంగోలులో సీఎం పాల్గొనే జన చైతన్య యాత్రకు వినూత్న రీతిలో భద్రత కల్పించేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు భారీగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిదాడులు తప్పవని మావోయిస్టులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజాప్రతినిధులకు భారీ భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News