: చంద్రబాబు పతనానికి ఇది నాంది.. జగన్ అండ మరింత బలాన్ని ఇచ్చింది: ఆక్వా ఫుడ్ పార్క్ ఉద్యమ నేత సత్యవతి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండ తనకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని సోమవారం బెయిలుపై విడుదలైన ఆక్వా ఫుడ్ పార్క్ ఉద్యమ నేత ఆరేటి సత్యవతి అన్నారు. తుందుర్రు బాధితుల పరామర్శకు జగన్ రావడం తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఓ మహిళను అక్రమంగా హత్యాయత్నం కేసులో ఇరికించిన ఘనత మూటకట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు పతనానికి ఇదే నాంది అని పేర్కొన్నారు. తాను ఇప్పటికే 50 రోజులు జైలులో ఉన్నానని, ఏడాది ఉంచినా తన ఉద్యమాన్ని ఆపబోనని తేల్చి చెప్పారు. గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా ఆక్వాఫుడ్‌కు వ్యతిరేకంగా పోరాడతానని సత్యవతి స్పష్టం చేశారు.