: మోదీపై వెంకయ్య ప్రశంసల జల్లు.. ప్రధానిని మరో సర్దార్‌గా అభివర్ణించిన వైనం


ప్రధాని నరేంద్రమోదీపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. మోదీని సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో పోల్చారు. పటేల్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియం నుంచి మోదీ ప్రారంభించిన ‘రన్ ఫర్ యూనిటీ’ సభలో ప్రసంగించిన వెంకయ్య.. గొప్ప దృష్టి కలిగిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. స్పష్టంగా ఆలోచిస్తూ, సరైన నిర్ణయాలు తీసుకునే ఆయన లాంటి నాయకుడు దేశానికి అవసరమని పేర్కొన్నారు. పటేల్ లాంటి లక్షణాలు మళ్లీ ప్రధాని మోదీలోనే ఉన్నాయని, ఆయన దేశ ప్రధాని కావడం మన అదృష్టమని కొనియాడారు. పటేల్ వారసత్వాన్ని ముందు తరాలకు అందించేందుకు ఆయన జయంతిని ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’గా ప్రకటించినట్టు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్లకే ఆయన మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కనుక దేశ తొలి ప్రధాని అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని నమ్మే వారిలో తాను కూడా ఒకడినని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News