: జమ్ముకశ్మీర్‌కు 1093.34 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ భవనాల మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆ రాష్ట్రానికి 1093.34కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. ఈ నిధులను తొలి విడతలో భాగంగా విడుదల చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. జమ్ముకశ్మీర్‌లో అధికారంలో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో నిధుల కొరత లేకుండా ఆదుకుంటున్నారు. ఆ రాష్ట్రంలో విద్యను మరింత ప్రోత్సహించడానికి నిధులు విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.