: మొదటిసారి భారత్-పాక్ సరిహద్దులో విధులు నిర్వహించిన మహిళా జవాన్లు


దేశ సరిహద్దు భద్రతా దళాల్లో దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళా జవాన్లను నియమించారు. దీపావళి సందర్భంగా వారితో భారత్- పాకిస్థాన్ సరిహద్దులో విధులు నిర్వహింపజేసినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. పురుషులతో సమానంగా వారు అక్కడ తమ విధులు పూర్తి సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. దీపావళి పండుగ రోజున తమ కుటుంబసభ్యులతో గడపలేకపోయినప్పటికీ ఆ బాధను తమ విధినిర్వహణ అధిగమించేలా చేసిందని మహిళా జవాన్లు చెప్పారు. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ తాము దేశ పౌరులందరూ దీపావళిని జరుపుకోవడానికి సహకరించామని, అంతకన్నా తమకు కావాల్సిందేముంటుందని చెప్పారు. పాకిస్థాన్, భారత్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త ప‌రిస్థితుల దృష్ట్యా దీపావ‌ళికి జవాన్లకు సెలవు ఇవ్వలేదని అధికారులు తెలిపారు. తాజాగా సరిహద్దు వద్ద విధుల్లో చేరిన మహిళా జవాన్లందరూ ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, పశ్చిమ్‌బెంగాల్ రాష్ట్రాలకు చెందినవారని చెప్పారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉంటున్న వారి కుటుంబ స‌భ్యుల గురించి ఏమీ ఆలోచించ‌కుండా జ‌వాన్లు విధినిర్వహణలో అప్రమత్తంగా ఉన్నార‌ని చెప్పారు. సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన దీపావళి పండుగ‌ కార్యక్రమాల్లో మ‌హిళా జ‌వాన్ల‌తో పాటు బీఎస్‌ఎఫ్‌ అధికారులు కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News