: 6 లక్షలతో ఫ్యాన్సీ నంబర్ ను దక్కించుకున్న నందమూరి తారకరత్న
గుంటూరు జిల్లా నర్సరావుపేట ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఫ్యాన్సీ నంబర్ల ఆన్ లైన్ వేలంలో తనకు ఇష్టమైన నంబర్ ను నందమూరి తారకరత్న దక్కించుకున్నారు. 9999 నంబర్ కోసం రూ.6 లక్షలు చెల్లించిన తారకరత్న ఈ నంబర్ ను దక్కించుకున్నాడు. ఈ నంబర్ ను సొంతం చేసుకునేందుకు పలువురు ప్రముఖులు పోటీపడ్డారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ వాహనాలకు 9999 నంబర్ ఉంటుంది. ఈ నంబర్ తన లక్కీ నంబర్ అని ఆయన చాలాసార్లు చెప్పడం తెలిసిందే.