: సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ పై పోలీసులు కట్టుకథలు చెబుతున్నారు: అసదుద్దీన్ ఒవైసీ
సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ పై పోలీసులు కట్టుకథలు చెబుతున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. అండర్ ట్రయల్ ఖైదీలకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా అసదుద్దీన్ డిమాండ్ చేశారు. కాగా, మధ్యప్రదేశ్ లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8 మంది సిమి ఉగ్రవాదులు తప్పించుకున్న కొన్ని గంటల్లోనే వారి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను వారు ప్రతిఘటించడంతో ఎన్ కౌంటర్ చేయక తప్పలేదని పోలీస్ అధికారులు చెబుతుండటం తెలిసిందే.