: ‘ప్రత్యూష’ చిన్నారులతో సమంత ఆనంద దీపావళి
పలువురు సెలెబ్రిటీలు ముఖ్యంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు నిన్న దీపావళి పండగను జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది హీరోయిన్ సమంత హైదరాబాదులోని తన స్వచ్ఛంద సంస్థలోని చిన్నారులతో సరదాగా, నవ్వులు చిందిస్తూ ఆనందంగా దీపావళి వేడుకలు జరుపుకుంది. చిన్నారులతో కలిసి కాకరపువ్వొత్తులు కాల్చుతూ దిగిన ఫొటోను సమంత తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రత్యూష స్వచ్ఛంద సంస్థలోని చిన్నారులతో గడపటం తనకు ఎప్పుడూ సంతోషాన్నిచ్చే విషయమని ఆ ట్వీట్ లో పేర్కొంది.