: చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం భేటీ... సచివాలయ భవనాల అప్పగింతపై చర్చ


అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆఫీసులో రాష్ట్ర కేబినెట్‌ భేటీ అయింది. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా హైదరాబాద్‌లోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సచివాలయ భవనాలు తెలంగాణకు అప్పగిద్దామా? అనే విష‌యంపై చర్చించే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్న పోస్టుల కోసం అభ్య‌ర్థుల‌ వయో పరిమితిని 42 ఏళ్లకు పెంచే అంశంపైన కూడా స‌మావేశంలో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. రాష్ట్రంలో వివిధ సంస్థలకు చేయాల్సిన‌ భూ కేటాయింపులపై మంత్రులు చ‌ర్చించ‌చ‌నున్నారు. ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న స్విస్‌ ఛాలెంజ్ విధానానికి సంబంధించి కొత్త నోటిఫికేషన్‌ ఇస్తామని ఇటీవ‌లే హైకోర్టుకు ఏపీ సర్కారు తెలిపిన నేప‌థ్యంలో ఈ అంశంపై కూడా మంత్రుల‌తో చంద్ర‌బాబు చ‌ర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News