: హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల ఈ రోజు మధ్యాహ్నం వర్షం కురిసింది. బషీర్‌బాగ్, నాంపల్లి, లక్డీకపూల్, కోఠీ, సుల్తాన్ బజార్లలో ఓ మోస్తరు వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, మసాబ్‌ట్యాంక్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి.