: భవనాల విషయంలో చంద్రబాబు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నారు : గాలి ముద్దు కృష్ణమనాయుడు


తెలంగాణకు సచివాలయ భవనాల అప్పగింత విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నారని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. జూబ్లీహాల్, ఎంసీఆర్ హెచ్ ఆర్డీ భవనాన్ని ఏపీకి కేటాయించాలని, భవనాల పంపకాల విషయమై పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన కోరారు. షెడ్యూల్ 9,10 లో ఎటూ తేల్చని 37 సంస్థ లు ఉన్నాయన్నారు. కాగా, ప్రజల కోసం పనిచేసిన చంద్రబాబుకు ఏడో ర్యాంకు, ఫాంహౌస్ లో పడుకున్న కేసీఆర్ కు మొదటి ర్యాంకు రావడం చాలా విడ్డూరంగా ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు పనితీరు అద్భుతంగా ఉందని ప్రధాని మోదీయే మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. బ్రిటిష్ వాళ్లు సికింద్రాబాద్ ను నిర్మిస్తే, చంద్రబాబు హయాంలో హైటెక్ సిటీని నిర్మించారని అన్నారు. హైదరాబాదు ఆదాయాన్ని చంద్రబాబు 60 శాతం పెంచారన్నారు.

  • Loading...

More Telugu News