: పాకిస్థాన్ రేంజర్ల కాల్పుల్లో జవాను మృతి.. మరో ఇద్దరికి గాయాలు
పాకిస్థాన్ రేంజర్లు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. జమ్ముకశ్మీర్ మెంధర్‌లోని బలాకోటేలో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఉధంపూర్‌కి తరలించారు. మరోవైపు రాజౌరీలోని మంజాకోటే, గంభీర్ సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులు జరపడంతో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. పాక్ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది.