: హిల్లరీ వర్గానికి, ముస్లింలకు తుపాకులు అమ్మం: కలకలం రేపుతున్న యూఎస్ గన్ స్టోర్ యాడ్
అమెరికాలో ఓ గన్ దుకాణం ఎదుట ఆ స్టోర్ యజమాని పెట్టిన యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి కలకలం రేపుతోంది. ఆ వివాదాస్పద పోస్టర్ లో ముస్లింలకు తుపాకులను విక్రయించబోమని, హిల్లరీ క్లింటన్ మద్దతుదారులకు గన్స్ అమ్మబోమని ఉంది. పెన్సిల్వేనియాలోని రూరల్ జాక్సన్ సెంటర్ లో గల అల్ట్రా ఫైర్ ఆర్మ్స్ యజమాని పౌల్ చాండ్లర్ ఈ ప్రకటనను ఉంచారు. అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీ రాకూడదని, ఉగ్రవాదులుగా మారే ముస్లింలను తాను ద్వేషిస్తానని చెబుతూ, 54 ఏళ్ల పౌల్ ఈ ప్రకటనను స్టోర్ ముందు ఉంచడంతో పాటు స్థానిక న్యూస్ పేపర్లకూ ప్రకటన ఇచ్చారు. దయచేసి ముస్లింలు, హిల్లరీ మద్దతుదారులు తన స్టోర్ కు రావద్దని, ముస్లింలకు గన్స్ అమ్మడం అంత క్షేమకరం కాదని భావిస్తున్నట్టు ఆయన స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఈ వ్యాపార ప్రకటన, పౌల్ దుకాణం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.