: వేధింపుల కేసు.. పోలీస్ స్టేషన్ లో యాసిడ్ తాగిన భర్త మృతి


వేధింపుల కేసులో విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు వచ్చిన భర్త యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖపట్టణంలో జరిగింది. తన భర్త నూకరాజు వేధిస్తున్నాడంటూ అతని భార్య లక్ష్మి రెండు రోజుల క్రితం గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం నూకరాజును పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అయితే, బాత్రూమ్ కు వెళ్లాలి అని చెప్పి వెళ్లిన నూకరాజు, అక్కడున్న యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయం గమనించిన పోలీసులు అతడిని కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నూకరాజు ఈరోజు ఉదయం మృతి చెందాడు. కాగా, భార్య తనపై కేసు పెట్టిందన్న మనస్తాపంతోనే నూకరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. తమ మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని, అయితే, తన భర్త ఇంతపని చేస్తాడని తాను అనుకోలేదని భార్య లక్ష్మి కన్నీటి పర్యంతమైంది.

  • Loading...

More Telugu News