: ఏవోబీ మారణకాండ ఆందోళన కలిగిస్తోంది.. బాక్సైట్ సంపదను కొల్లగొట్టే కుట్ర జరుగుతోంది: ప్రొ.హరగోపాల్
ఇటీవల ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ)లో జరిగిన ఎన్ కౌంటర్‌పై తెలంగాణ ప్రజాస్వామిక వేదిక సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ఎన్‌కౌంటర్ నిజమే అయితే దానిపై న్యాయ విచారణ జరిపించాలని ప్రొ.హరగోపాల్ డిమాండ్ చేశారు. 140 లక్షల కోట్ల బాక్సైట్ సంపదను కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. సహజవనరులు ఆదీవాసీల హక్కు అని, వారి హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏవోబీలో కూంబింగ్‌ను ఆపాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణ కమిటీ వేయాలని అన్నారు. ఏవోబీలో జరిగిన మారణకాండ ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.