: సిమీ ఉగ్రవాదుల ఆచూకీని స్థానికులే తెలిపారు: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)కి చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదులు కేంద్రకారాగారం నుంచి పారిపోయిన నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు తక్కువ సమయంలోనే ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌పై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకొని పారిపోడం ఒక తీవ్రమైన చర్యగా అభివర్ణించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతోనే ఉగ్రవాదుల జాడ కనిపెట్టి పోలీసులు ఉగ్రవాదులను మట్టుబెట్టారని ఆయన అన్నారు.