: ఆటపాటలతో గోవాలో సందడి చేసిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్


దీపావ‌ళి ప‌ర్వ‌దినాన‌ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గోవాలో సంద‌డి చేశాడు. త‌న‌ కుటుంబ సభ్యులతో కలిసి గోవాలో దీపావ‌ళి జ‌రుపుకున్నాడు. సముద్రపు ఒడ్డున ఉన్న ఓ ప్ర‌యివేటు రిసార్ట్‌ లో ఆటపాటలతో ఆనందంగా గ‌డిపాడు. ఈ వేడుక‌లో సల్మాన్ బావ అతుల్ అగ్నిహోత్రి, సోదరుడు సోహైల్ భార్య సీమా, సోదరి అర్పిత, ఆమె భర్త ఆయుష్, వారి పిల్ల‌లు పాల్గొన్నారు. ఆయుష్ ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను సామాజిక మాధ్య‌మంలో పోస్ట్ చేశాడు. సల్మాన్ ఖాన్‌ కూడా అక్క‌డ హీరో సూరజ్ పంచోలీతో పాటు ప‌లువురు యువ‌కుల‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం కబీర్ ఖాన్ ద‌ర్శ‌కత్వంలో వ‌స్తోన్న 'ట్యూబ్ లైట్' చిత్రం షూటింగులో స‌ల్మాన్ ఖాన్ పాల్గొంటున్నాడు. ఏక్ థా టైగర్, బజరంగీ భాయ్ జాన్ సినిమాలు వీరి కాంబినేషన్ లోనే వ‌చ్చి మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి. దీంతో 'ట్యూబ్‌లైట్‌'పై అభిమానుల్లో భారీ ఆశ‌లే ఉన్నాయి.

  • Loading...

More Telugu News