: బాలకృష్ణతో కలసి చేసుకున్న దీపావళే ప్రత్యేకంగా అనిపిస్తుంది: ఎమ్మెల్యే రోజా


దీపావళి అంటే తనకు ఎంతో ఇష్టమని... అగ్ర హీరోయిన్ గా ఉన్నా, రాజకీయాల్లో బిజీగా ఉన్నా దీపావళి పండుగకు కొత్త బట్టలు, మిఠాయిలు, సినిమాలు అన్నీ తనకు ఉండాల్సిందే అని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. తన పిల్లలకు కూడా దీపావళి అంటే చాలా ఇష్టమని చెప్పారు. దీపావళి పండుగకు తన అన్నయ్య పిల్లలు కూడా తమ దగ్గరకే వస్తారని తెలిపారు. ఈ దీపావళికి పిల్లలతో కలిసి 'ఇజం' సినిమాకు వెళ్లానని చెప్పారు. ప్రతి దీపావళి తనకు ఎన్నో ఙ్ఞాపకాలను మిగుల్చుతోందని రోజా తెలిపారు. అయితే, 'పెద్దన్నయ్య' సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు... తాను, బాలకృష్ణ కలిసి జరుపుకున్న దీపావళి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుందని... చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా ఆ దీపావళిని జరుపుకున్నామని చెప్పారు. తనతో పాటే అందరూ బాగుండాలని... తన వల్ల పది మందికి మంచి జరగాలని ఎప్పుడూ భగవంతుడిని కోరుకుంటానని రోజా తెలిపారు.

  • Loading...

More Telugu News