: ఆ డబ్బేమైనా రేఖ సొంత డబ్బా?: హేమమాలిని
బీజేపీ రాజ్యసభ సభ్యురాలు, వెటరన్ నటి రేఖ.. మరో వెటరన్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని నియోజకవర్గంలో అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు మంజూరు చేయడంపై హేమమాలిని తనదైన రీతిలో స్పందించారు. మధుర నియోజకవర్గంలోని బాలికల పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు రేఖ రూ. 47 లక్షలు కేటాయించగా, ఆవేమీ సొంత డబ్బును ఇవ్వలేదని, ఎంపీలకు ఇచ్చే నిధుల నుంచే కొంత కేటాయించారని, ఈ విషయాన్ని పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని హేమమాలిని అన్నారు. తన ఎంపీ నిధులన్నీ ఖర్చయిపోయాయని, తన సెక్రటరీ ద్వారా అడిగించానని తెలిపారు. రేఖ తన స్నేహితురాలే అయినా, తానేమీ నేరుగా అడగలేదని స్పష్టం చేశారు.