: అపచారం... పుష్కరిణిలో బీరు బాటిల్స్, పేక ముక్కలు
భక్తుల మనోభావాలు దెబ్బతినే దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షరామ క్షేత్రంలో చోటు చేసుకుంది. ప్రసిద్ధ సప్తగోదావరి పుష్కరిణిలో బీరు బాటిల్స్, పేకముక్కలు బయటపడ్డాయి. వాటిని చూసిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, పుష్కరిణి వద్ద చెత్తాచెదారం పేరుకు పోయి దుర్గంధం వెదజల్లుతోంది. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించడానికి కూడా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా ఆలయ ఈవో చలపతిరావు, అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు.