: గ్రూప్ గా కలసి వుండటం వల్లే దొరికిపోయిన సిమీ ఉగ్రవాదులు!


గత రాత్రి రెండు గంటల సమయంలో సెంట్రీ రామ్ కుమార్ ను దారుణంగా హత్య చేసి పారిపోయిన ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదుల పన్నాగం భోపాల్ పోలీసుల ముందు పారలేదు. ఉగ్రవాదులను ఎలాగైనా పట్టుకోవాలన్న పోలీసుల దృఢ నిశ్చయం భోపాల్ నగరాన్ని, చుట్టు పక్కల ప్రాంతాలనూ దిగ్బంధం చేయగా, ఈ ఎనిమిది మందీ పోలీసుల కళ్లు గప్పి ఎక్కువ దూరం ప్రయాణించలేకపోయారు. పారిపోయిన తరువాత అందరూ విడిపోకుండా, ఒకే గ్రూప్ గా కలసి వుండటంతో కేవలం 8 గంటల వ్యవధిలోనే వారు దొరికిపోయారు. రాత్రి 2 గంటలకు జైలు నుంచి పారిపోయిన వారిని ఉదయం 10 గంటల సమయంలో పోలీసులు గుర్తించారు. భోపాల్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న, ఇంత్ కేడీ గ్రామ సమీపంలో వీరిని గుర్తించారు. తమకు లొంగిపోవలసిందిగా పోలీసులు వారిని కోరినప్పటికీ, వారు వినిపించుకోకుండా, పరుగు లంఘించుకోవడంతో కాల్పులు జరపక తప్పలేదని, కాల్పుల్లో వారంతా హతమయ్యారని ఓ పోలీసు అధికారి వివరించారు.

  • Loading...

More Telugu News