: జూనియర్ ఎన్టీఆర్ కమిట్ మెంట్ కు హ్యాట్సాఫ్: రంభ
తెలుగు సినీరంగంలో దశాబ్దకాలం పాటు అగ్ర హీరోయిన్ గా చెలామణి అయింది రంభ. అందం, అభినయంతో పాటు మంచి డ్యాన్సర్ కూడా కావడంతో... రంభకు తిరుగులేకపోయింది. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో... అడపా దడపా కొన్ని స్పెషల్ సాంగ్స్ లో స్టెప్పులేసి, అలరించింది. తాజా ఈ చిన్నది ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. 'యమదొంగ' సినిమాలో జూనియర్ తో కలసి చిందులేసిన రంభ... ఆ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది. ఆ సాంగ్ లో చాలా కష్టమైన మూమెంట్స్ ఉన్నాయని... వాటిని వేస్తున్న సమయంలో ఎన్టీఆర్ కాలికి దెబ్బ తగిలి, రక్తం వచ్చిందని... అయినా ఆగకుండా అలాగే డ్యాన్స్ చేశాడని చెప్పింది. ఎన్టీఆర్ కమిట్ మెంట్ కు హ్యాట్సాఫ్ అని తెలిపింది. విభిన్న పాత్రలు సమర్థవంతంగా పోషించగల నటుడు ఎన్టీఆర్ అంటూ కితాబిచ్చింది.