: జియో వినియోగదారులారా... అశ్రద్ధ చేస్తే జియో సర్వీస్ ఆగిపోతుంది
జియో ప్రకటించిన వెల్ కమ్ ఆఫర్ కు దేశ వ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. జియో సిమ్ కార్డును సొంతం చేసుకోవడానికి వినియోగదారులు ఎగబడ్డారు. సిమ్ కోసం గంటల కొద్దీ క్యూలో కూడా నిలబడ్డారు. కాస్త శ్రమ పడిన తర్వాత... జియో వినియోగదారులంతా ప్రస్తుతానికి వాయిస్ కాల్స్ ని, ఫ్రీ డేటాని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, జియో వినియోగదారులు ఓ విషయంలో కొంచెం కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే వారి ఆనందానికి తాత్కాలికంగా బ్రేక్ పడుతుంది. తమ పూర్తి వివరాలను కస్టమర్లు వెంటనే జియోకు అందించాల్సి ఉంటుంది. లేకపోతే జియో సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. అంతేకాదు, జియో కస్టమర్ల ఇన్ బాక్స్ కు ఓ వెరిఫికేషన్ మెసేజ్ వస్తుంది. వెంటనే రిలయన్స్ షోరూంకు వెళ్లి ఫింగర్ ప్రింట్ వేయాలనేది ఆ మేసేజ్ సారాంశం. ఈ విషయంలో అశ్రద్ధ చేసినా... జియో సేవలు ఆగిపోతాయి.