: ట్రంప్ పై మహిళల ఆరోపణలు నిజమని నమ్ముతున్న 70 శాతం అమెరికన్లు
రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ వివిధ సందర్భాల్లో తమతో అసభ్యకరంగా ప్రవర్తించారని, ఆయన చేత లైంగికంగా వేధింపులకు గురయ్యామని పలువురు మహిళలు చేస్తున్న ఆరోపణలను 70 శాతం మంది అమెరికన్లు నమ్ముతున్నారు. ఏపీ-జీఎఫ్ కే సంస్థ ట్రంప్ పై వచ్చిన ఆరోపణలను ప్రజలు ఏ మేరకు నమ్ముతున్నారన్న విషయమై సర్వే నిర్వహించగా, ఈ విషయం వెల్లడైంది. ట్రంప్ మద్దతుదారుల్లో 35 శాతం మంది తమ నేత అలాంటి పనులు చేసే వాడేనని చెబుతుండటం గమనార్హం. ఇక ఈ ఆరోపణలను ప్రత్యర్థుల కుట్రగా, ట్రంప్ అభివర్ణిస్తున్నప్పటికీ, అమెరికన్లు మాత్రం ట్రంప్ ఆరోపణలు నమ్ముతుండటం, సర్వేల్లో ప్రత్యర్థి హిల్లరీ పైచేయి సాధిస్తుండటంతో ఆయన వర్గం ఒత్తిడిలో ఉంది.