: ఆస్ట్రేలియాలో భారతీయుడిని చంపింది ఓ మెంటల్ పేషెంట్ అట!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ సిటీలో పంజాబ్ కు చెందిన మన్ మీత్ అలిషర్ (29) ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి నిందితుడు ఎడ్వర్డ్ ఒడొనోహు (48)ని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ జరిపారు. అయితే, మన్ మీత్ ను హత్య చేసిన ఎడ్వర్డ్ ఓ మెంటల్ పేషెంట్ అని క్వీన్స్ ల్యాండ్ ఆరోగ్య మంత్రి కామెరూన్ డిక్ తెలిపారు. గతంలో క్వీన్స్ ల్యాండ్ మెంటల్ హెల్త్ సర్వీస్ లో అతను ట్రీట్ మెంట్ తీసుకున్నాడని వెల్లడించారు.ఎడ్వర్డ్ కు ఇచ్చిన ట్రీట్ మెంట్ పై దర్యాప్తు జరుగుతుందని ఆయన తెలిపారు. బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్న మన్ మీత్ పై మండే స్వభావమున్న మొలొటోవ్ కాక్ టైల్ లాంటి ద్రావకాన్ని పోయడంతో... మంటలంటుకుని మన్ మీత్ అక్కడికక్కడే చనిపోయాడు. మన్ మీత్ హత్యను భారత్ సీరియస్ గా తీసుకుంది. ఆస్ట్రేలియా ప్రధాని టర్న్ బుల్ తో భారత ప్రధాని మోదీ స్వయంగా మాట్లాడారు. అయితే, ఇది తీవ్రవాద, జాత్యహంకార చర్య కాదని ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు.