: ముగిసిన చార్ ధామ్ యాత్ర... నేడు గంగోత్రి, రేపు కేదార్ నాధ్, యమునోత్రి మూత, 16న బద్రీనాథ్


ఈ సీజనులో పరమ పవిత్ర చార్ ధామ్ యాత్ర ముగిసింది. పరమశివుడికి అత్యంత పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమైన వేళ, గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్ లను నేటి నుంచి ఆరు నెలల పాటు మూసివేయనుండగా, సాక్ష్యాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటాడని భావించే బద్రీనాథ్ ను 16న మూసివేయనున్నారు. ఈ ఆరు నెలల కాలం చార్ ధామ్ ప్రాంతమంతా మంచుతో కప్పేయబడుతుందన్న సంగతి తెలిసిందే. తిరిగి వైశాఖ మాసం ప్రవేశించిన తరువాత ఈ దేవాలయాలను తెలుస్తారు. ఈ సందర్భంగా నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గంగోత్రిని నేడు, కేదార్ నాథ్ ను రేపు ఉదయం 8 గంటలకు మూసివేయనున్నామని, ఆపై గురువారం నుంచి కేదారేశ్వరుడు తన శీతాకాల గృహమైన ఉఖిమత్ లోని ఓంకారేశ్వర్ దేవాలయంలో భక్తులకు దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. ఇక యమునోత్రి ఆలయాన్ని కూడా రేపు మూసివేయనుండగా, యుమునా అమ్మవారు ఈ ఆరు నెలల పాటు ఖర్సాలీలోని యమునాలయంలో భక్తులకు దర్శనమివ్వనుంది.

  • Loading...

More Telugu News