: బయో డీజిల్ ట్యాంకర్ బోల్తా.. బకెట్లతో వచ్చి ఆయిల్ పట్టుకెళ్లిన స్థానికులు


ఈ రోజు ఉద‌యం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న బయో డీజిల్ ట్యాంకర్ నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం చేరుకోగానే అక‌స్మాత్తుగా అదుపు త‌ప్ప‌డంతో రోడ్డుపైనే బోల్తా ప‌డింది. దీంతో ఆ ట్యాంకర్‌కు చిల్లులు ప‌డి అందులోంచి ఆయిల్ కారిపోయింది. దీనిని గ‌మ‌నించిన స్థానికులు బకెట్లు, డ్రమ్ములతో అక్క‌డ‌కు ప‌రుగుప‌రుగున వ‌చ్చి ఆయిల్‌ను పట్టుకెళ్లారు. స‌ద‌రు బ‌యో డీజిల్ ట్యాంక‌ర్‌లో దాదాపు రెండు వేల లీటర్ల ఆయిల్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. లారీ బోల్తా ప‌డ‌గానే చేసేదేమీ లేక‌ లారీ డ్రైవర్, క్లీనర్ అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News