: మోదీ చెప్పిందే పాకిస్థాన్ లో అమలవుతోంది: ఇమ్రాన్ ఖాన్


తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత, పాకిస్థాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ పై విరుచుకుపడ్డారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభీష్టానికి అనుగుణంగా పాక్ లో షరీఫ్ నడుచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ అజెండా పాకిస్థాన్ లో అమలవుతోందంటూ విమర్శించారు. మోదీ అజెండా మేరకే పాకిస్థాన్ సైన్యం ప్రాభవాన్ని తగ్గించేందుకు నవాజ్ షరీఫ్ యత్నిస్తున్నారని అన్నారు. గతంలో శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లినప్పుడు తన తల్లి, బిడ్డలకు కాకుండా నరేంద్ర మోదీకి మొట్ట మొదటి ఫోన్ ను షరీఫ్ చేశారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News