: భారత సంతతి డ్రైవర్ సజీవ దహనం విషయంపై ఆస్ట్రేలియా ప్రధానికి ఫోన్ చేసిన మోదీ


ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో భారత సంతతి వ్యక్తి, డ్రైవర్ మన్ మీత్ అలిషెర్ (29)ను సజీవంగా దహనం చేసిన విషయమై భారత ప్రధాని నరేంద్ర మోదీ, అస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్ బుల్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఘటనతో భారతీయుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నట్టు స్పష్టం చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. దీనిపై స్పందించిన టర్న్ బుల్, ఈ ఘటన తనకూ దిగ్భ్రాంతిని కలిగించిందని, పూర్తి స్థాయి విచారణ ప్రారంభమైందని తెలిపారు. కాగా, మన్ మీత్ నడుపుతున్న వాహనంపై పేలుడు పదార్థం విసరడంతో, ఆయన సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులు పెరగడం పట్ల అక్కడున్న భారత సంతతి తీవ్ర నిరసనలు తెలుపుతోంది.

  • Loading...

More Telugu News