: రన్ వే మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో.. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మూసివేత
ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును మూసివేయనున్నారు. రన్ వే మెయింటెనెన్స్ పనుల నిమిత్తం విమానాశ్రయాన్ని మూసివేస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అన్ని విమానయాన సంస్థలకు, పైలట్లకు ముందుగానే తెలిపారు. తాము తెలిపిన షెడ్యూల్ కు అనుగుణంగానే విమానాలను నడపాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కోరారు. ప్రతి రోజు ముంబై ఎయిర్ పోర్టు నుంచి 1600కి పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇందులో దేశీయ విమాన సర్వీసులు ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ 18 నుంచి విమానాశ్రయం నిర్వహణ పనులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా, ఈ రోజు రన్ వే పనులను చేపట్టారు.