: అన్నం తినేందుకు ఇచ్చిన కంచం, మంచినీరు తాగేందుకు ఇచ్చిన గ్లాసే ఉగ్రవాదులకు మారణాయుధాలయ్యాయి!
స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందిన 8 మంది ఉగ్రవాదులు అత్యంత కట్టుదిట్టమైన భోపాల్ కేంద్ర కర్మాగారం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. వీరికి కాపలాగా ఉన్న సెంట్రీ రమాశంకర్ ను వీరు దారుణంగా హత్యచేశారు. హత్య చేసేందుకు వీరు అన్నం తినే స్టీలు కంచాన్ని, మంచినీరు తాగే గ్లాసును ఉపయోగించడం గమనార్హం. దేశమంతా దీపావళి వేడుకలు జరుపుకుంటున్న వేళ, తాము తప్పించుకునేందుకు ఇదే సరైన సమయమని భావించిన ఉగ్రవాదులు ఓ పథకం ప్రకారం, జైలు గోడల గడియ చుట్టూ ఉన్న ఇటుకలు, రాళ్లను ముందుగానే తొలగించి వుంచారు. కంచం, గ్లాసుల అంచులను ముందుగానే పదునుగా సానబట్టి ఉంచుకున్నారు. తమను అడ్డుకునేందుకు చూసిన రమాశంకర్ పై దాడి చేసి, అదే కంచాన్ని మారణాయుధంగా వాడి గొంతు కోశారు. ఆపై తాపీగా గోడదూకి పారిపోయారు. ఇప్పుడు వీరిని అరెస్ట్ చేసేందుకు మధ్యప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు ప్రతి వాహనాన్నీ పరిశీలిస్తూ సోదాలు చేస్తున్నారు.