: పెను విలయాన్ని సృష్టించిన ఇటలీ భూకంపం... 600 సంవత్సరాల నాటి బాసిలికా చర్చి నేలమట్టం


ఇటలీలో వచ్చిన భారీ భూకంపం పెను విలయాన్ని సృష్టించింది. దాదాపు మూడు వేల మందికి పైగా నిరాశ్రయులు కాగా, ప్రాణనష్టం అంత తీవ్రంగా ఏమీ లేదని జాతీయ పౌర సంరక్షణ సంస్థ వెల్లడించింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో భూకంపం రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టి ప్రాణాలను రక్షించుకున్నారని తెలిపారు. కాగా, సంస్కృతి, వారసత్వ సంపద, ప్రాచీన కట్టడాలకు నెలవైన ఇటలీలో చాలా భవనాలు ఈ భూకంపం ధాటికి కుప్పకూలాయి. చారిత్రక కేంద్రాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. 600 సంవత్సరాల నాడు నిర్మించిన ప్రతిష్ఠాత్మక బాసిలికా చర్చి భూకంప తీవ్రతకు నేలమట్టం అయింది. ఉంబ్రియా కేంద్రంగా వచ్చిన భూకంపం అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలోని రోమ్, వెనిస్ ల వరకూ ప్రకంపనలు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి దేశానికే కష్టకాలమని వ్యాఖ్యానించిన ఇటలీ ప్రధాని మాటెయో రెంజీ, ప్రజలను ఆదుకుంటామని, పాడైన ప్రతి ఇంటినీ ప్రభుత్వమే నిర్మిస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News