: బెంగళూరులో ఆంధ్ర పారిశ్రామికవేత్త దారుణ హత్య
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్త పరుచూరి సురేంద్రకుమార్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి ఆయనను కాల్చి చంపారు. పక్కా ప్లాన్ తోనే ఈ మర్డర్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే, ఈ హత్య వెనుక ఆయన పాత మేనేజర్ హస్తం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రియలెస్టేట్ విభేదాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాపారంతో పాటు, పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ ను కూడా సురేంద్ర కుమార్ నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మికచింతన కలిగిన సురేంద్రకుమార్ భద్రాచలం నుంచి సీతారాముల విగ్రహాలను తెప్పించి, బెంగళూరులో కళ్యాణం కూడా జరిపించారని చెబుతున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.