: కయాంత్ గండం గడిచింది... భయపెడుతున్న మరో తుపాను


హమ్మయ్య!... కయాంత్ తుపాను గండం గడిచిందని ఊపిరి పీల్చుకునేంతలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. ఉత్తర కోస్తాకు మరో తుపాను ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. నవంబర్ 1న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి... నాలుగో తేదీ నాటికి ఉత్తర కోస్తా, మధ్య కోస్తా వైపు రానుందని చెప్పారు. తీరానికి దగ్గరగా వచ్చిన తర్వాత ఈ తుపాను ఎక్కువ ప్రభావం చూపుతుందని వెల్లడించారు. ఈ తుపాను ప్రభావంతో... శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. నవంబర్ 2, 3 తేదీల కల్లా తుపానుపై పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. వరి కోతకు వచ్చిన రైతులు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News