: ఇండో-పాక్ సరిహద్దులో ఎప్పటి నుంచో కొనసాగుతున్న సాంప్రదాయానికి బ్రేక్


భారత్-పాక్ సరిహద్దులో ఎప్పటి నుంచో కొనసాగుతున్న సాంప్రదాయానికి ఈసారి బ్రేక్ పడింది. ముఖ్యమైన పండుగలప్పుడు బోర్డర్ దగ్గర భారత్, పాక్ సైనికులు స్వీట్లు పంచుకుని, శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయతీ. పంజాబ్ లోని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే, ఉరీ ఉగ్రదాడి అనంతరం, సర్జికల్ దాడులతో భారత్ సమాధానం చెప్పడంతో... పాక్ వైపు నుంచి నిరంతరం కాల్పుల ఒప్పంద విరమణ కొనసాగుతోంది. ఈ క్రమంలో, సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో, దీపావళి పర్వదినాన స్వీట్లు పంచుకునే కార్యక్రమానికి తెరపడింది. భారత్ కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ రేంజర్లతో స్వీట్లు పంచుకుని, శుభాకాంక్షలు చెప్పుకునే కార్యక్రమాన్ని ఈసారి ఆపివేశారు. గతంలో కూడా కొన్ని సార్లు ఇదే మాదిరి ఈ కార్యక్రమం ఆగిపోయింది.

  • Loading...

More Telugu News