: బంతి స్టేడియం దాటేలా కొట్టాడు: కరణ్ పై అమీర్ ప్రశంసలు


ఎన్నో వివాదాల మధ్య విడుదలైన బాలీవుడ్ మూవీ 'యే దిల్ హై ముష్కిల్' విజయవంతంగా ఆడుతోంది. ఈ సందర్భంగా, స్టార్ హీరో అమీర్ ఖాన్ ఆ సినిమా యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు. యువ హీరో రణబీర్ కపూర్ నటన అద్భుతంగా ఉందంటూ ఆయన కితాబిచ్చారు. దర్శకుడు కరణ్ జొహార్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. "సినిమా చూశా. బాల్ స్టేడియం దాటిపోయేలా కరణ్ కొట్టాడు. ఐశ్వర్య, అనుష్క, రణబీర్ ల యాక్టింగ్ సూపర్ గా ఉంది. సినిమా నాకు చాలా బాగా నచ్చింది" అంటూ అమీర్ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించడం వివాదాస్పదం అయింది. ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో, ఈ సినిమా విడుదలను ఎమ్మెన్నెస్ అడ్డుకోవాలని నిర్ణయించింది. చివరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ మధ్యవర్తిత్వంతో సినిమా విడుదలైంది.

  • Loading...

More Telugu News