: ఆసియా చాంపియన్స్ హాకీ ఫైనల్లో పాక్ ను మట్టికరిపించిన భారత్
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ కప్ భారత్ కైవసం అయింది. ఫైనల్ మ్యాచ్ లో 3-2 తేడాతో పాకిస్థాన్ ను మట్టికరిపించింది. లీగ్ దశలో భారత్ చేతిలో ఓటమి పాలైన పాక్, ఫైనల్లో భారత్ ను దెబ్బతీయాలని చూసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా, ఈ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. భారత్ ఆటగాడు రూపిందర్ పాల్ సింగ్ తొలి గోల్ సాధించి జట్టుకు శుభారంభం చేశాడు. ఆ తర్వాత మన క్రీడాకారుడు అఫాన్ యూసుఫ్ మరో గోల్ చేశాడు. 2-0 స్కోరు ఉన్న సమయంలో, పాక్ వరుసగా రెండు గోల్స్ చేయడంతో రెండు జట్ల స్కోరు సమానమైంది. మ్యాచ్ మరికొన్ని నిమిషాల్లో ముగుస్తుందనగా, నికిన్ తిమ్మయ్య గోల్ చేయడంతో భారత్ 3-2 ఆధిక్యంలోకి వెళ్లడంతో కప్ ను కైవసం చేసుకుంది.