: అభిమానులను సాదరంగా ఆహ్వానించి.. సరదాగా మాట్లాడిన రజనీకాంత్
తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులను సాదరంగా ఆహ్వానించి.. సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. రజనీ ‘కబాలి’ సినిమా చెన్నైలోని రోహిణీ థియేటర్ లో వందరోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా థియేటర్ వద్ద రజనీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం, రజనీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా తన అభిమానులను రజనీకాంత్ ప్రేమతో ఆహ్వానించారు. కొంచెం సేపు వారితో ముచ్చటించడమే కాకుండా వారికి దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్పడంతో అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది.