: టెస్టుల్లో తాజా రికార్డు నెలకొల్పిన పాక్ కెప్టెన్ మిస్బా
పాకిస్థాన్ తరపున ఇప్పటివరకు అత్యధిక టెస్టు మ్యాచ్ లకు నాయకత్వం వహించిన మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పేరిట ఉన్న రికార్డును పాక్ క్రికెట్ ప్రస్తుత కెప్టెన్ మిస్బా వుల్ హక్ తిరగరాశాడు. 1982-92 మధ్య కాలంలో ఇమ్రాన్ ఖాన్ 48 టెస్టు మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. వెస్టిండీస్ తో ఈరోజు మొదలైన మూడో టెస్టుతో మిస్బావుల్ హక్ 49వ టెస్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా మిస్బా మాట్లాడుతూ, రికార్డులు నెలకొల్పడం కన్నా పాకిస్థాన్ ను గెలిపించడానికే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. ప్రతి టెస్టు మ్యాచ్ తమకు ముఖ్యమేనని, మెరుగైన ప్రదర్శనకు, విజయం కోసం తాము కష్టపడుతుంటామని అన్నారు.