: కాబూల్ లో మహిళలకు తొలి ఫిట్ నెస్ సెంటర్ ఏర్పాటు


ఆఫ్గానిస్థాన్ లోని కాబూల్ లో మహిళలకు తొలి ఫిట్ నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు. ‘బ్లూ మూన్ క్లబ్’ పేరుతో ఈ ఫిట్ నెస్ సెంటర్ ను నురిస్తానీ అనే యువతి ఏర్పాటు చేసింది. మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకునే నిమిత్తం ఈ క్లబ్ ను ఏర్పాటు చేశానని ఆమె చెప్పింది. ఈ క్లబ్ ఏర్పాటు కోసం సుమారు రూ.13 లక్షలు వెచ్చించినట్లు చెప్పింది. కాగా, మహిళలకు సంబంధించి కఠిన సంప్రదాయాలు అమల్లో ఉన్న ఆఫ్గానిస్తాన్ లో ఇటువంటి ఫిట్ నెస్ సెంటర్ ను ఏర్పాటు చేయడమంటే, చాలా ధైర్యంతో కూడుకున్న పనేనని అంటున్నారు.

  • Loading...

More Telugu News