: చిన్నప్పుడు నేను ఎందుకూ పనికిరాకుండా పోతాననుకున్నారు: సంగీత దర్శకుడు గోపీ సుందర్


‘ఒకప్పుడు నేను పనికిరాకుండా పోతాననుకున్నారు. ఆ తర్వాత నన్ను చూసిన వాళ్లు ఇప్పుడు సంబరపడుతున్నారు’ అని సంగీత దర్శకుడు గోపీ సుందర్ అన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నేను పదో తరగతిలో ఫెయిలయ్యాను. తెలిసినవాళ్లంతా నా భవిష్యతు గురించి భయపడ్డారు. నేను ఎందుకూ పనికిరాకుండాపోతానని అకున్నవాళ్లు లేకపోలేదు. నేను సినిమాల్లోకి వచ్చి మంచి పేరు సంపాదించుకున్న తర్వాత ఎవరైతే నాపై వ్యాఖ్యలు చేశారో వాళ్లే సంబరపడ్డారు’ అని నాటి విషయాలను గోపీ సుందర్ గుర్తు చేసుకున్నారు. తాను పుట్టి పెరిగింది కేరళలోని కొచ్చీ అని, తన తల్లికి సంగీతమంటే చాలా ఇష్టమని, తనకు తెలియకుండానే సంగీతంపై తనకు ఆసక్తి పెరిగిందని తెలుగులో పలు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన గోపీ సుందర్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News