: పరిటాల అనుచరుల వీరంగంపై విచారణ మొదలు పెట్టిన పోలీసులు


అనంతపురం జిల్లా రాప్తాడులో వెలుగులోకి వచ్చిన పరిటాల శ్రీరామ్ అనుచరుల దాడి దృశ్యాలపై పోలీసుల విచారణ మొదలైంది. ఈ దృశ్యాలు మీడియాలో ప్రసారమైనప్పటి నుంచి జిల్లా ప్రజల్లో ముఖ్యంగా తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుండగా, అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. ఘటనా స్థలిని సందర్శించిన పోలీసు బృందం, బోయ ఓబులేషుపై దాడిని ప్రత్యక్షంగా చూసిన వారిని ప్రశ్నిస్తోంది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను వారి నుంచి రాబడుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో పరిటాల అనుచరులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు సాగిస్తున్నారని, వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ విమర్శించారు. ఇక్కడ ఆటవిక న్యాయం యథేచ్ఛగా సాగుతోందని, పట్టపగలు దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తుగా మారి వారి ఆగడాలను చూసీ చూడనట్టు వెళుతున్నారని అన్నారు. ఓబులేషుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News