: ఐరాస భవనంపై 'హ్యాపీ దివాలీ'... చరిత్రలో తొలిసారిగా వేడుకలు


ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం దీపావళి కాంతుల్లో ధగధగలాడింది. ఇండియాలో జరుపుకునే ముఖ్యమైన పండగల్లో దీపావళి ఒకటికాగా, ఐరాస ప్రధాన కార్యాలయంలో తొలిసారిగా ఈ పండగ నిర్వహించారు. భవనాన్ని విద్యుద్దీపాలతో అలంకరించి 'హ్యాపీ దీవాలి' అంటూ శుభాకాంక్షలు కనిపించేలా అలంకరించారు. ఇక ఇదే విషయాన్ని యూఎన్ లో భారత దౌత్యాధికారి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. తొలిసారిగా దీపావళి వేడుకలు నిర్వహించిన ఐరాస అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ భవంతి ముందు పలువురు స్థానికులు, ప్రవాస భారతీయులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

  • Loading...

More Telugu News