: ములాయం కుటుంబ విభేదాలు డ్రామానే... చుట్టూ నేరచరితులతో అఖిలేష్: మాయావతి


సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇంట నెలకొన్న రాజకీయ సంక్షోభం కేవలం ఓ నాటకమని బహుజన సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన చుట్టూ నేరచరితులను ఉంచుకున్నారని సంచలన విమర్శలు చేశారు. ఓ న్యూస్ ఏజన్సీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, యూపీ ప్రజలను సమాజ్ వాదీ పార్టీ వెర్రివాళ్లను చేస్తోందని అన్నారు. వచ్చే సంవత్సరం యూపీ ఎన్నికల్లో గూండాలను వాడుకోవాలని ఎస్పీ చూస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెలికితీసి ఒక్కో భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని బీజేపీ 2014లో ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ, ఆ హామీ ఏమైందని, బీజేపీ ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని పొందిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో యూపీలో తమ పార్టీయే విజయం సాధిస్తుందన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News