: మంచి కానుకలు ఇచ్చారు.. ఓ తండ్రికి ఇంతకన్నా ఏం కావాలి?: హరికృష్ణ


ఈ సంవత్సరం తన ఇద్దరు కుమారుల నుంచి తనకు మంచి బహుమతులు లభించాయని నందమూరి హరికృష్ణ వ్యాఖ్యానించారు. కల్యాణ్ రామ్ తాజా చిత్రం 'ఇజం' విజయవంతంగా నడుస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఓ టెలివిజన్ చానల్ కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూను ఇచ్చారు. ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' పెద్ద హిట్ అయిందని గుర్తు చేసిన హరికృష్ణ, తన మరో కుమారుడు కల్యాణ్ రామ్ ఇష్టపడి చేసిన 'ఇజం' ప్రేక్షకులను మెప్పించిందని, దీని వెనుక దర్శకుడు పూరీ జగన్నాధ్ కృషి ఎంతో ఉందని అన్నారు. ఓ తండ్రిగా తనకు ఇద్దరు కుమారుల నుంచి మంచి గిఫ్ట్స్ వచ్చాయని, ఇంతకన్నా ఇంకేమీ అవసరం లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News