: కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా: సమాజ్ వాదీ ఎంపీ


ఇండియాలో వెలుగుచూసిన గూఢచార్య కుంభకోణంలో తన పాత్ర ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సమాజ్ వాదీ ఎంపీ చౌదరీ మనవార్ సలీమ్ స్పందించారు. పాక్ హై కమిషన్ అధికారులతో తనకు సంబంధాలున్నాయని నిరూపిస్తే, తాను కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పీఏ ఫర్హాత్ అరెస్ట్ కావడంపై మీడియాతో మాట్లాడిన ఆయన, ఢిల్లీ పోలీసులు సహా మూడు సంస్థల విచారణ తరువాత ఫర్హాత్ కు క్లీన్ చిట్ వచ్చిందని, ఆపైనే అతన్ని తన పర్సనల్ అసిస్టెంట్ గా నియమించుకున్నానని తెలిపారు. గూఢచర్య ఆరోపణలపై ఫర్హాత్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆపై ఎంపీ సలీమ్ పైనా ఆరోపణలు వచ్చాయి. కాగా, సలీమ్ ను ములాయం సింగ్ ఏరికోరి 2012లో రాజ్యసభకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బుందేల్ ఖండ్ ప్రాంతంలో ముస్లిం ఓట్లపై కన్నేసిన ములాయం, తెరపైకి సలీమ్ ను తీసుకువచ్చారు. ఓ వైపు యూపీలో సమాజ్ వాదీ పార్టీ కుటుంబ రాజకీయం రచ్చకెక్కిన వేళ, అదే పార్టీకి చెందిన ఎంపీపై ఈ ఆరోపణలు వస్తుండటం, ములాయం శిబిరాన్ని మరింత కలవరపరుస్తోంది.

  • Loading...

More Telugu News