: పది పాకిస్థానీ తలలు తెండి: 'అమర జవాను' మన్ దీప్ కుటుంబ సభ్యుల డిమాండ్
హర్యానాలో ఉగ్రవాదుల చేతికి చిక్కి అమరుడైన భారత జవాను మన్ దీప్ సింగ్ కుటుంబం తీవ్ర ఆగ్రహంతో ఉంది. మన్ దీప్ మృతదేహాన్ని ఉగ్రవాదులు ముక్కలు ముక్కలుగా నరికి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. మన్ దీప్ మరణానికి ప్రతీకారంగా కనీసం 10 పాకిస్థానీల తలలను భారత సైనికులు తీసుకురావాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ చేస్తున్న ఆగడాలకు బుద్ధి చెప్పాల్సిందేనని మన్ దీప్ సోదరుడు సందీప్ సింగ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి పాక్ సైనికులు కవర్ ఫైర్ చేస్తున్న వేళ, కంచె దాటి భారత్ లోకి ప్రవేశించిన ముష్కరులు సిపాయి మన్ దీప్ సింగ్ ను పట్టుకుని హత్య చేసిన సంగతి తెలిసిందే. మన్ దీప్ కు రెండేళ్ల క్రితమే వివాహం కాగా, ఆయన భార్యను ఓదార్చేందుకు గ్రామమంతా తరలివచ్చింది.