: దీపావళి దీపాలు వెలిగించిన ‘కాటమరాయుడు’ పవన్ కల్యాణ్.. పోస్టర్ విడుదల!


స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ త‌రువాత ప‌వ‌ర్ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. వ‌చ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాల‌ని సినిమా యూనిట్ భావిస్తోంది. దీపావళి సందర్భంగా తాజాగా ఆ చిత్ర‌బృందం ప్రేక్ష‌కుల‌కు పండుగ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ‘కాటమరాయుడు’ ప‌వ‌న్ క‌ల్యాణ్, శ్రుతి హాసన్ కలసి దీపాలు వెలిగిస్తోన్న ఫొటోను విడుద‌ల చేసింది. ఇందులో ఎంతో విన‌యంగా దీపాలు వెలిగిస్తోన్న ‘కాటమరాయుడు’ని శ్రుతిహాస‌న్ ఆస‌క్తిగా చూస్తోంది. కాగా, ప‌వ‌న్‌, శ్రుతిహాస‌న్ న‌టిస్తోన్న‌ ‘కాటమరాయుడు’ సినిమాకి కిషోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వ‌హిస్తున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన వీరమ్‌ రీమేక్‌గా రూపుదిద్దుకుంటోన్న‌ ఈ చిత్రంను నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. అనూప్‌రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు. కమల్‌కామరాజు, శివ బాలాజీ, అజయ్‌, అభిమన్యుసింగ్ ఈ సినిమాలో ప్ర‌ధాన‌ పాత్రల్లో క‌న‌ప‌డనున్నారు.

  • Loading...

More Telugu News