: కుటుంబంతో కలిసి పాకిస్థాన్ ను వీడిన భారత హైకమిషన్ అధికారి
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులతో ఇరు దేశాల సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. ఇటీవలే పాకిస్థాన్ తమ దేశంలో ఉండడానికి వీలులేని వ్యక్తిగా పాక్‌లోని భారత హై కమిషన్ అధికారి సూర్జిత్ సింగ్‌పై ముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ రోజు ఆ దేశం విడిచారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఈ నెల 27న ఆయనను 48 గంటల్లోగా పాకిస్థాన్ విడిచిపెట్టాల్సిందిగా ఆదేశించినట్టు చెప్పింది. ఇటీవలే భారత్.. పాకిస్థాన్ హైకమిషన్ అధికారిపై నిఘా పెట్టి, గూఢచర్యానికి పాల్పడిన కారణంగా దేశం నుంచి విడిచివెళ్లపోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే పాక్ ఈ చర్యకు దిగింది. దీనిపై పాక్ వివరణ ఇస్తూ సూర్జిత్ సింగ్ వియెన్నా కన్వెన్షన్, దౌత్యపరమైన నిబంధనలను ఉల్లంఘించారని ప్రచారం చేసుకుంది. దీంతో ఆయన పాక్‌ను విడిచిపెట్టవలసి వచ్చింది.