: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. ముళ్లపొదల్లో పెట్రోల్ పోసి యువకుడిని తగులబెట్టిన దుండగులు
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. అక్కడి శ్రీరాంపురం సమీపంలో ఓ యువకుడిని దుండగులు ముళ్లపొదల్లో పెట్రోల్ పోసి తగులబెట్టారు. రైట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి అయిన శివ వెంకటేశ్ నిన్న ఉదయం కాలేజీకి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. తాజాగా ఆ యువకుడి మృతదేహం ఇలా కనిపించడంతో అతడి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.